అన్నమయ్య: జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. వరుసగా మూడోసారి ధరలు పెరగడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.