విజయవాడ ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో పీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల సుబ్బరాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ,పుస్తకాలు,యూనిఫాంలు తమ వద్దే కొనాలని బలవంతం చేస్తున్నాయని ఆరోపించారు. తక్కువ ధర పుస్తకాలను ఎక్కువ రేటుకు అమ్మి తల్లిదండ్రులను దోచుకుంటున్నారని విమర్శించారు.