GNTR: గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆరు కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడిన కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని కొత్తపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో సీఐ వీరయ్య చౌదరి బృందం జరిపిన తనిఖీల్లో ఈ ముఠా గుట్టు రట్టయింది. విశాఖపట్నం నుండి ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.