PLD: అచ్చంపేట మండలానికి చెందిన 19 మంది నిరుపేద బాధితులకు మంజూరైన రూ.11,59,314 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుక్రవారం రాత్రి తాళ్లచెరువులో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న ఈ ఆర్థిక సాయం కొండంత భరోసా ఇస్తుందన్నారు.