గుంటూరు జీజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద గురువారం ఓ గుర్తుతెలియని వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందారు. అస్వస్థతతో పడి ఉన్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.