NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడులో ఉపాధి పనులకు వెళ్లిన వనమ్మ అనే మహిళ పాముకాటుకు గురైంది. కాలువ పూడిక తొలగింపు పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సహచర కార్మికులు వెంటనే ఆమెను ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్య శాలకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.