TG: రేవంత్ రెడ్డికి నిజంగానే 2034 వరకు సీఎంగా ఉంటాననే ధైర్యం ఉంటే.. వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఆ దమ్ము లేకపోతే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.