మన దగ్గర పిండి వంటల వంటివి చేసినప్పుడు మిగిలిన నూనెను తిరిగి వాడుకోవటం తరచూ చూసేదే. రెండోసారి అంటే ఏమో గానీ మళ్లీ మళ్లీ వేడి చేసి, వంటలకు ఉపయోగించకూడదు. ఇలా తిరిగి కాచినప్పుడు ట్రాన్స్ఫ్యాట్స్ పుట్టుకొస్తాయి. అంతేకాదు, కొన్ని క్యాన్సర్ కారకాలూ వెలువడతాయి. ఇలాంటి నూనెతో చేసిన పదార్థాలను అదేపనిగా తినటం వల్ల కొందరికి జీర్ణకోశ క్యాన్సర్లు తలెత్తే ప్రమాదముంది.