SKLM: గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని PACS అధ్యక్షుడు సలాన మోహన్రావు అన్నారు. మెలియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామంలో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మారుమూల గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.