BPT: చీరాల మహాత్మా గాంధీ కోపరేటివ్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ సొసైటీ పాలకవర్గ ఎన్నికల్లో చారుగుళ్ళ గురు ప్రసాద్ ప్యానల్ అఖండ విజయం సాధించింది. వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌గా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 11 డైరెక్టర్ స్థానాలకు గాను 7 స్థానాలను ఈ పానెల్ దక్కించుకుంది. చారుగుళ్ళ గురు ప్రసాద్ అధ్యక్షుని గాను ఇడపలపాటి మురళీమోహన్ కార్యదర్శి గాను నియమించారు.