అన్నమయ్య: ఫీజుల పేరిట ప్రైవేట్ స్కూళ్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి బాబు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కడప పర్యటనకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో జరుగుతున్న పుస్తకాల దోపిడీ, ఫీజుల భారం, వంటి వాటిపై లోకేశ్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.