సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని ముస్లిం ఈద్గా, స్మశాన వాటిక వద్ద 14 సోలార్ పోల్స్ ఏర్పాటుకు శుక్రవారం టీడీపీ నాయకులు మార్కింగ్ పనులు చేపట్టారు. గత ఎన్నికల సమయంలో మంత్రి సవిత ఇచ్చిన హామీ మేరకు ఈ పనులు ప్రారంభమవడంతో ముస్లిం మైనారిటీలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.