VZM: గజపతినగరం మండలంలోని గుడివాడ గ్రామంలో ఉపాధి పని వద్ద శుక్రవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కూలీలు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేషియల్ రికగ్నిషన్ రద్దు చేయాలని, ఒక పూట పని కల్పించాలని, వేసవి అలవెన్స్ ఇవ్వాలని, తదితర సంస్థలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.