KDP: ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలిలో కాన్వాయ్‌ను ఆపి యమవరం గ్రామానికి చెందిన 11 నెలల చిన్నారి శ్రీ విష్ణుకు సంబంధించిన ఆసుపత్రి ఎస్టిమేట్ లెటర్‌ను తల్లిదండ్రులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు అందజేశారు. చిన్నారి తండ్రి సాయి కుమార్, తల్లి లక్ష్మీదేవి తమ బిడ్డ చికిత్స కోసం సహాయం కోరగా, స్పందించిన మంత్రి లోకేష్ ‘బాబును నేను చూసుకుంటాను’ అంటూ భరోసా ఇచ్చారు.