భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్, కోహ్లీ (రో-కో) ఫిట్నెస్గా ఉన్నంత కాలం వన్డేలు ఆడాలని మాజీ క్రికెటర్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి ఆటను తాను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తానని, ప్రస్తుతం వారి రిటైర్మెంట్ గురించి చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అలాగే, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీతో భవిష్యత్తులో భారత క్రికెట్కు మరింత కీర్తి లభిస్తుందన్నాడు.