విశాఖలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘ఎలక్ట్రిక్ రాపిడ్ ట్రాన్సిట్’ ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. BRTS రోడ్‌తో పాటు పెందుర్తి-కాన్వెంట్ జంక్షన్ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. ‘హెస్ గ్రీన్ మొబిలిటీ’ సంస్థ ఆసక్తి చూపుతుండగా, ఈ ఎలక్ట్రిక్ బస్సులో ఒకేసారి 240 మంది ప్రయాణించవచ్చు.