MHBD: డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల లింగయ్య గురువారం గ్రామ చెరువు వద్ద గొర్రెలను మేపడానికి వెళ్లాడు. తీవ్ర ఎండల కారణంగా చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై గ్రామంలో విషాదం నెలకొంది.