ATP: పగలు విధులు నిర్వహిస్తూ, రాత్రి వేళల్లో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న జూనియర్ ఇంజినీర్ బాలరాజును సస్పెండ్ చేస్తూ గుంతకల్లు డీఈఈ సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదోని సెక్షన్లో పని చేస్తున్న ఇతడిని కర్నూలు జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు బానిసై ఏడు చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.