NLG: అమెరికాలో అకాల మరణం చెందిన నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన నవ్య కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అండగా నిలిచారు. ప్రవాస తెలుగు సంఘాల (తానా) సహకారంతో రూ.70 లక్షల నిధులు సేకరించి, ఆమె భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నవ్య మృతదేహం నేడు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది.