అన్నమయ్య: కలకడ పట్టణంలో గురువారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటున్న సమయంలో ఏడాది వయసున్న బాలిక ప్రమాదవశాత్తూ చేపల గాలాన్ని నోటిలో గుచ్చుకుంది. బొగ్గులు తయారుచేసే దంపతుల కుమార్తెకు ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నోటిలో గాలం ఇరుక్కోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే బాలికను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.