అన్నమయ్య: పీలేరు సమీపంలోని రొంపిచెర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు 108 సిబ్బంది తెలిపారు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.