»Ktr Said Soon 8 Lakh People Will Get Jobs In The Field Of Life Sciences 2028
KTR: త్వరలో 8 లక్షల మందికి ఉద్యోగాలు..ఈ రంగంలోనే అవకాశాలు!
తెలంగాణలో రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇదే విభాగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేస్తామని వెల్లడించారు.
రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ విభాగంలో 8 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr) పేర్కొన్నారు. ఇప్పటికే ఈ రంగంలో 4 లక్షల మంది జాబ్స్(jobs) చేస్తున్నారని వాటిని రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. బయో ఏషియా(bio asia) సదస్సు(summit) జరగనున్న క్రమంలో నిర్వహించిన చిట్ చాట్(chit chat) కార్యక్రమంలో కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 20వ బయో ఏషియా సదస్సు(bioasia summit 2023 )హైదరాబాద్లో(Hyderabad) జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 19 ఏళ్లలో ఈ సదస్సుల ద్వారా రాష్ట్రానికి 24 వేల కోట్ల పెట్టబడులు వచ్చాయని గుర్తు చేశారు. మరోవైపు దేశంలో లైఫ్ సైన్సెస్ రంగానికి(life science industry) బయో ఏషియా కీలక సేవలను అందించిందని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని అవకాశాలని పరిచయం చేయడానికి ఈ సదస్సు మరింత ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సులకు ఇప్పటికే 100కుపైగా దేశాల నుంచి అనేక మంది పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఈ సదస్సులో ఈసారి మొదటి సారిగా ఆపిల్ కంపెనీ పాల్గొనబోతున్నట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల చూపు ఈ బయో ఏషియా సదస్సుపై ఉందన్నారు. ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్ రంగం(life science industry)లో అవకాశాలకు ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana government), హైదరాబాద్ ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్క్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో 2028 నాటికి రెట్టింపు స్థాయిలో ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని కేటీఆర్(ktr) అన్నారు.
హైదరాబాద్ పరిధిలో జీవశాస్త్ర రంగాల ఏకో సిస్టమ్ విలువ 2021లో 50 బిలయన్ డాలర్లు ఉండగా..2028 వరకు 100 బిలియన్ డాలర్లకు చేరేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలను 8 లక్షలకు పెంచుతామని స్పష్టం చేశారు. జీవశాస్త్ర రంగంలో తెలంగాణ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నట్లు మంత్రి గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం 900 కోట్ల రూపాయల టీకాలు హైదరాబాద్ సంస్థల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. ఇది భవిష్యత్తులో 1400 కోట్ల రూపాయలకు చేరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు హైదరాబాద్(Hyderabad)తోపాటు ఇతర జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీల(medical college) ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాలు ఈ రంగంలో అభివృద్ధి చెందుతాయని కేటీఆర్ అన్నారు.