AP: లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితుల రిమాండ్ రేపటితో పూర్తి కానున్న నేపథ్యంలో సిట్ అధికారులు మొత్తం 8 మంది నిందితులను రేపు ACB కోర్టులో హాజరుపరచనున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున రిమాండ్‌ను పొడిగించాలని అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. కాగా, A7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా ఈ రోజే లొంగిపోయిన విషయం తెలిసిందే.