AKP: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొత్తపల్లి జలపాతానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఎత్తైన బండరాళ్ల పైనుంచి జాలువారుతున్న నీటి ప్రవాహంలో చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గంటల తరబడి ఉత్సాహంగా స్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. జలపాతం పరిసరాల్లోని వ్యూ పాయింట్ల వద్ద పర్యాటకులు ఫోటోలు దిగుతూ సందడి చేసారు.