ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి అన్నారు. గురువారం భీంపూర్ మండలంలోని అర్లీ(టి) గ్రామంలో విద్యాశాఖ అధికారులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని తల్లిదండ్రులను కలుస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు.