సూర్యాపేటలోని 47వ వార్డులో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సయ్యతో కలిసి ప్రారంభించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.