భద్రాద్రి పుణ్యక్షేత్రంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం భక్తులు, సేవకులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దామోదరరావు తెలిపారు. ఈ సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక సేవలను మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.