కోనసీమ: గంజాయి, డ్రగ్స్‌పై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎస్సీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు రాజోలు పట్టణంలో డీఎస్పీ మురళీమోహన్, సీఐ సురేష్ బాబు ఆధ్యర్యంలో బుధవారం రాత్రి ప్రత్యేక సోదాలు నిర్వహించారు. బయో చెక్ డ్రగ్ డిటెక్షన్ కిట్లతో అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, 10 మందికి మత్తు పదార్థాలు సేవించినట్లుగా తేలింది. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.