AP: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబలకుండా మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సురక్షిత నీరు అందించేలా ఎస్వోపీ జారీ చేసింది. మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితమైతే కమిషనర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్లైన్లు తనిఖీ చేయాలని ఆదేశించింది. డ్రైనేజీల్లో నీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది.