IPL క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ టికెట్ల దందాకు తెరలేపారు. సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా అభిమానులను మోసం చేస్తున్న ఈ ముఠాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక అడ్వైజరీ జారీ చేసింది. అనధికారిక ఏజెంట్ల వద్ద టికెట్లు కొని మోసపోవద్దని, కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్స్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.