WNP: జిల్లాలో బుధవారం 399 కొనుగోలు కేంద్రాల ద్వారా 9184 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 1,14,045 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు పూర్తయిందని వెల్లడించారు. 229 లారీల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించి అన్లోడింగ్ చేశారన్నారు. నిల్వలు ఉన్న చోట రవాణాను మరింత వేగవంతం చేయాలన్నారు.