ADB: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈనెల 23వ తేదీ నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా విత్తన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీధర్ తెలిపారు. వారోత్సవాల సందర్భంగా పలు విత్తనాలు విక్రయించేందుకు అందుబాటులో ఉంచామన్నారు. మరిన్ని వివరాలకు శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డిని సంప్రదించాలన్నారు.