MNCL: మంచిర్యాలలోని కాలేజ్ రోడ్లో ప్రతిభ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న లిటిల్ సంస్కారి పాఠశాలపై విచారణ చేపట్టాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పురేళ్ల నితీష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలు, మౌలిక సదుపాయాలు, ఫైర్ సేఫ్టీ, రక్షణ చర్యలు లేవని తెలిపారు.