PLD: చిలకలూరిపేట పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు నరకం అనుభవిస్తున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికి అధికారులు దానిని వినియోగించకపోవడంపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై వారు మండిపడుతున్నారు.