NGKL: కొల్లాపూర్ పట్టణంలోని సోఫీ చమన్ దర్గా గంధోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. షేఖ్ సోఫీ ఆరిఫ్ సుత్తారి హఫీజ్ సాబ్ నివాసం నుంచి ప్రారంభమైన గంధం ఊరేగింపు పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. మహారాష్ట్ర షేర్ బాజా వాయిద్యాలతో సాగిన ఈ ఊరేగింపు దర్గాకు చేరుకోగానే ప్రత్యేక ఫాతెహా కార్యక్రమాలు నిర్వహించారు.