BDK: చుంచుపల్లి మండలంలో డబ్బుల వివాదం దాడికి దారి తీసింది. కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో బొల్లి కార్తీక్‌పై కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటనలో కట్ట శ్రీనివాస్, నేరేడుమల్లి నవదీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వ్యక్తిపై ఫోన్లో బెదిరింపుల కేసు కూడా నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.