SRCL: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు.