GDWL: పెద్ద తాండ్రపాడు 33 కేవీ ఫీడర్లో ఏబీ స్విచ్ ఏర్పాటు పనుల కోసం రేపు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు. దీనివల్ల తాండ్రపాడు, ముండ్లదిన్నె, తుమ్మిళ్ల గ్రామాలకు సరఫరాలో అంతరాయం కలగనుంది. లైన్ క్లియర్ తీసుకుంటున్నందున వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.