AKP: పాయకరావుపేట-తుని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావుకు శ్రమశక్తి అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సందర్భంగా ఈ అవార్డు లభించింది. పలువురు ఆయనను అభినందించారు.