AP: కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు అనుమతులు కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై రైట్స్ సంస్థ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ మార్గంలో 13కి.మీ మేర డబుల్ డెక్కర్ లైన్ ఏర్పాటు చేసేలా నివేదిక ఇచ్చారు. రైట్స్ నివేదిక ప్రకారం అనుమతులు జారీ చేసి, ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.