PPM: జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల కేసులపై వర్చువల్ (జూమ్ ) విధానంలో జిల్లా పోలీస్ అధికారులుతో ఎస్పీ ఎస్. వి.మాధవరెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు కారణమైన అతివేగం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.