AP: గురుదేవ్ రవిశంకర్ ఆధ్యాత్మిక నాయకుడే కాదు.. గొప్ప మానవతావాది అని సీఎం చంద్రబాబు అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘అనేక ఖండాల్లో గురుదేవ్ దశాబ్దాలుగా సందేశాలు ఇస్తున్నారు. హింస లేని సమాజం కోసం ఆయన పాటుపడ్డారు. ప్రపంచ దేశాల నుంచి మారుమూల గ్రామాల వరకు అహింస స్థాపనకు పాటుపడ్డారు’ అని పేర్కొన్నారు.