HYD: HMDA మాస్టర్ ప్లాన్ బడా బాబులకు వరంగా, పేద రైతులకు శాపంగా మారిందని బీజేపీ నేతలు విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా జోన్లు మారుస్తూ, రైతులు తమ భూముల్లో ఇళ్లు కట్టుకోకుండా కన్జర్వేషన్ జోన్ల పేరుతో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ సవరించాలని గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు.