ADB: యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకుని ఉన్నతంగా స్థిర పడాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మావల మండల కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళాలో MLA పాయల్ శంకర్, SP అఖిల్ మహాజన్‌తో సమావేశమై మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని సూచించారు.