NTR: వత్సవాయి మండలంలో కురిసిన వర్షాలకు మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నేలకొరిగిన మొక్కజొన్న పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు సైంటిస్ట్‌లు శివప్రసాద్, భవాని, సత్యనారాయణ పరిశీలించారు. పడిపోయిన మొక్కజొన్నలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. లేత వయసులో ఉన్న పంటలో ఎకరానికి 13:0:44 లేదా లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున యూరియా పిచికారీ చేయాలన్నారు.