IPL 2026లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్స్ ధరించి కనిపించిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తన తల్లిని కోల్పోయాడు. ఇందుకు సంతాపంగా PBKS సభ్యులు నల్ల బ్యాండ్లు ధరించారు. ఈ విషయాన్ని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు.