పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇవాళ్టి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు PCB చీఫ్ మెహ్సిన్ నఖ్వీ గుడ్న్యూస్ చెప్పారు. ప్లే ఆఫ్స్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, జాతీయ పొదుపు చర్యలకు అనుగుణంగా మ్యాచులకు హాజరయ్యేటప్పుడు ఫ్యాన్స్ ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు.