విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ మూవీలతో మెప్పించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటి అవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.