Nandamuri Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్.. గత ఏడాది వచ్చిన బింబిసార సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు కళ్యాణ్. అమిగోస్, డెవిల్, బింబిసార 2తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. అయితే ముందుగా ఫిబ్రవరి 10న అమిగోస్ ఆడియెన్స్ ముందుకొచ్చింది.
నందమూరి కళ్యాణ్ రామ్.. గత ఏడాది వచ్చిన బింబిసార సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు కళ్యాణ్. అమిగోస్, డెవిల్, బింబిసార 2తో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. అయితే ముందుగా ఫిబ్రవరి 10న అమిగోస్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే కళ్యాణ్ రామ్‌తో ట్రిపుల్ రోల్ చేయించాడు. మనుషులు పోలిన మనుషులంటూ.. డాపుల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దాంతో కళ్యాణ్ రామ్ సరికొత్తగా కనిపించాడు. ట్రిపుల్ రోల్లో అదరగొట్టేశాడు. సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అనుకున్నంత స్థాయిలో థియేటర్లో సౌండ్ చేయలేకపోయింది. ఇక ఈ వారంలో నాలుగైదు కొత్త చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ధనుష్ ‘సార్’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ లాంటి సినిమాలు థియేటర్లోకొచ్చాయి. దాంతో అమిగోస్ హడావిడి తగ్గినట్టే. ఈ నేపథ్యంలో అమిగోస్ ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇండస్టీ వర్గాల ప్రకారం.. అనుకున్న సమయానికి కంటే ముందే డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మామూలుగా అయితే.. థియేటర్లలో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే అమిగోస్ ఓటీటీలోకి రావాలి. కానీ ఇప్పుడు నెల రోజుల్లోనే రానుందని అంటున్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు.