JGL: కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై అరైవ్ ఆలైవ్లో భాగంగా బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షలు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు.